ETV Bharat / state

ఫేస్​బుక్​ను కొత్తగా వాడారు... బుక్కయ్యారు..! - nigerians arrest in hydearbad

ఆయుర్వేద నూనెలు కొంటాం.... బహుమతులు పంపుతాం అంటూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లు లక్కీ ఓజా , జేమ్స్ ఒబాసిలను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 చరవాణీలు , ఒక ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకున్నారు.

nigerians arrest in hydearbad who did fraud with facebook
ఫేస్​బుక్​ను కొత్తగా వాడారు... బుక్కయ్యారు..!
author img

By

Published : Jan 8, 2020, 5:24 AM IST

దిల్లీ శివార్లలో నివాసముంటున్న నైజీరియన్లు... ధనవంతులు, వైద్య నిపుణుల వ్యాపారులుగా ఫేస్​బుక్ ఖాతాలను తెరిచి హైదరాబాద్​, బెంగళూరు నగరాల్లో నివాసముంటున్న వారికి అభ్యర్థనలు పంపుతున్నారు. స్పందించిన వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తామని ప్రలోభ పెట్టి.. వారి నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు.

నొప్పి నివారణ ఆయర్వేద నూనెను కొంటామంటూ అంబర్​పేటకు చెందిన ఓ యువకుని వద్ద నుంచి నైజీరియన్​ లక్కీ ఓజా రూ. 7.80 లక్షల నగదును బదిలీ చేయించుకున్నాడు. లండన్​లో ఉంటున్న సరోలిన్​ అనే యువతి పేరుతో పరిచయం చేసుకున్నాడు. విటోలిన్​ అనే నొప్పి నివారణ నూనె భారత్​లో లభిస్తుందని.. దాన్ని లండన్​లో అమ్మితే లక్షల్లో లాభం వస్తుందని వివరించారు. నైజీరియన్​ మాటలు నమ్మిన బాధితుడు.. అతను సూచించిన చిరునామాకు రూ. 97 వేల 500 పంపించాడు.

రెండు రోజుల తర్వాత సరోలిన్​కు ఫోన్​ చేయగా మరో 35 బాటిళ్లు కావాలని చెప్పాడు. లక్షల్లో లాభం వస్తుందని విటోలిన్ నూనె కంపెనీ ఖాతాలో రూ. 6,82,500 జమ చేశారు. సీసాలు ఎప్పుడు వస్తాయని ఫోన్​ చేయగా స్విఛాఫ్​ వచ్చింది. యువకుడు పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దిల్లీ వెళ్లి లక్కీ ఓజాకు సహకరించిన దీపక్​ను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి లక్కీ ఓజాను అదుపులోకి తీసుకుని హైదరాబాద్​కు తరలించారు.

ఇదిలా ఉండగా మరో నైజీరియన్ జేమ్స్ ఓబాసీ నకిలీ ఫేస్​బుక్ ఖాతాలను తెరిచి యువతీ యువకులకు అభ్యర్థనలు పంపేవాడు. పరిచయమైన కొద్దిరోజులకు బహుమతులు పంపుతానని చెప్పేవాడు. అనంతరం విమానాశ్రయ అధికారిగా బాధితులతో మాట్లాడేవాడు. ఖరీదైన బహుమతి వచ్చిందని.. దాన్ని విడిపించుకోవాలంటే వేలు డిపాజిట్ చేయాలనేవాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్​కు చెందిన ఓ యువకుడు రూ.1.2 లక్షల నగదు బదిలీ చేశాడు. బహుమతి రాదని తెలుసుకుని సీసీఎస్​ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్​ చేశారు.

ఫేస్​బుక్​ను కొత్తగా వాడారు... బుక్కయ్యారు..!

ఇదీ చదవండిః పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.