ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ. 380 కోట్లు విలువైన 4.85 లక్షల కేసుల లిక్కర్, 5.10 కేసుల బీరు మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడించాయి. ఇందులో హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ మూడు జిల్లాల్లో సింహభాగం మద్యం అమ్మకాలు జరగ్గా.. మిగిలిన మద్యం తదితర జిల్లాల్లో విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
డిసెంబరు నెలలో రూ. 2050 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 30.80 లక్షల లిక్కర్, 35 లక్షల కేసులు బీరు అమ్మకాలు జరిగాయన్నారు. సగటున రోజుకు రూ. 66 కోట్లు మద్యాన్ని రాష్ట్రంలోని మద్యం ప్రియులు తాగేశారు. హైదరాబాద్ నగరంలో రూ.270 కోట్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.540 కోట్లు, మేడ్చల్ జిల్లాలో దాదాపు 250 కోట్లు లెక్కన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు