ETV Bharat / state

పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్​... - happy new year 2020

నూతన సంవత్సరం వస్తుందంటే యువత జోరు మామూలుగా ఉండదు. క్లబ్​లు, పబ్​లు, ఈవెంట్లుతో నగరం ఉర్రూతలూగుతుంది. అలాంటిది ఈసారి నగరంలో ఆ తాలూకు జోష్​ కన్పించట్లేదు. జంటలకు మాత్రమే ప్రవేశం, స్టాగ్స్‌కు లేదనే నిబంధనలు పార్టీల మీద భారీగానే ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటికి తోడు  పోలీసులు అనుమతులు ఇవ్వడంలో కఠినంగా వ్యవహరించడం వల్ల ఈవెంట్ల సంఖ్య మరింతగా తగ్గింది.

New Year 2020 Events In hyderabad
నగరంలో తగ్గిన ఈవెంట్ల జోష్​... యువత బేహోష్​...
author img

By

Published : Dec 31, 2019, 7:44 PM IST

నగరంలో తగ్గిన ఈవెంట్ల జోష్​... యువత బేహోష్​...
నూతన సంవత్సర వేడుకల నగరంలో చప్పగానే సాగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి ఈవెంట్ల జోరు మరీ తగ్గింది. న్యూఇయర్​ వస్తుందంటే.... నగరంలో కనీసం 120 నుంచి 140 వరకు పెద్ద ఈవెంట్లు కనబడేవి కానీ... ఈసారి ఆ సంఖ్య సగానికి పైగానే పడిపోయింది. పబ్‌లు, క్లబ్‌లు, స్టార్‌హోటల్స్‌లలో రెగ్యులర్‌గా జరిగే పార్టీలు కూడా భారీగా తగ్గాయి. రిసార్టులలో కూడా అంతంత మాత్రంగానే పార్టీలు జరుగుతున్నాయని ఈవెంట్ల నిర్వహకులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలోని స్టార్‌హోటళ్లలో అధికశాతం ప్రైవేట్‌ వ్యక్తులే పార్టీలు నిర్వహించడం మరో కారణంగా కనిపిస్తుంది.

ఆ​ హోటళ్లలో మాత్రమే​...

గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో జరుగుతున్న న్యూ ఇయర్‌ పార్టీలో సెలబ్రిటీల జోరు తగ్గి.... డీజేల హవా కొనసాగుతోంది. ఈసారి మాత్రం పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. నగరంలో ప్రముఖ హోటళ్లతో పాటు.. నగర శివారలోని ఒకటి రెండు రిస్టార్టులు తప్ప... ఎక్కడా కొత్త ఏడాది వేడుకల హంగామా కనిపించడం లేదు. ఇందులోనూ కేవలం డీజేలకు మాత్రమే అనుమతిచ్చారు.

అనుమతులు కఠినం...

గతేడాది అనుభవాలు పార్టీ ప్రియులను వెంటాడుతుడటం వల్ల చాలా మంది అపార్ట్‌మెంట్లు, ఫామ్‌హౌస్‌ పార్టీలకు పరిమితవుతున్నారు. అదే విధంగా ఈసారి పోలీసులు అనుమతులు విషయంలో కఠినంగా వ్యహరిస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ రంగంలో ఏర్పాటు చేసే అనుభవం ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఖర్చులు పెరగటమూ కారణమే...

ఈవెంట్‌ నిర్వహణకు సమయం తక్కువగా ఉండటం వల్ల నిర్వహకులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో పోల్చితే ఈసారి జోరు బాగానే తగ్గిందనే చెప్పాలి. సినీ తారలు, లేకపోవడం, డీజే హంగామా తగ్గువగా ఉండటం, నిర్వహణ ఖర్చులు భారీ పెరగటం కూడా జోరు తగ్గటానికి కారణాలంటున్నారు నిర్వాహకులు.

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

TG_Hyd_48_30_ACB_TRAP_GHMC_AV_TS10014 Contributor: Sriram Yadav ( Malak Pet ) Script: Razaq Note: ఫీడ్ మోజో కిట్ ద్వారా వచ్చింది. ( ) హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ సర్కిల్‌ ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధకశాఖాధికారులకు చిక్కాడు. భవన నిర్మాణదారుడి నుంచి 3వేలు లంచం తీసుకుంటుంండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో చైన్‌మెన్‌గా పనిచేసే శ్రీధర్ అనే ఉద్యోగి శ్రీనివాస్ అనే ఇంటి నిర్మాణాదారు నుంచి ఇళ్లి నిర్మించుకోవడానికి 10వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా గతంలో 3వేలు రూపాయలు శ్రీధర్‌కు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం చైన్‌మెన్ అడుగగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు శ్రీధర్‌కు సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలోని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో మూడు వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.