ETV Bharat / state

'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి' - murder case

పోలీసులు చట్టాల కోణంలో కాకుండా... మానవీయ కోణంలో స్పందించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ సూచించారు. పశు వైద్యురాలి తల్లి, సోదరి ఫిర్యాదు చేస్తే... తమ పరిధిలోకి రాదని పోలీసులు పేర్కొన్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని ఆదేశించారు.

National_Women_Comission spoke shamshabad incident
'ఇలాంటి సందర్భాల్లో పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'
author img

By

Published : Nov 30, 2019, 8:45 PM IST

పశు వైద్యురాలి తల్లి, సోదరి ఫిర్యాదు చేస్తే... తమ పరిధిలోకి రాదని పోలీసులు పేర్కొన్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు చట్టాల కోణంలో కాకుండా... ముందుగా మానవీయ కోణంలో స్పందించాలని సూచించారు. యువతి డయల్ 100 కాల్ చేయలేదని తప్పుపట్టడం సరికాదని... అలా జరుగుతుందని ఎవరూ ఊహించరని తెలిపారు. ఘటన జరిగిన పరిసరాలు పరిశీలించి.. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు ఆమె తెలిపారు. యువతి ఫోన్​ను పోలీసులు ఇప్పటివరకు గుర్తించ లేదన్నారు.

పోలీసులు పెట్రోలింగ్​ కూడా చేయలేదు..

ఘటన జరిగిన టోల్ గేట్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నాయన్నారు. పోలీసులు పెట్రోలింగ్ కూడా చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని శ్యామల తెలిపారు. చాలా సేపటి నుంచి లారీ ఆపి... మద్యం తాగుతున్నప్పటికీ... వాహనం ఎందుకు ఆగి ఉంది. అందులో ఎవరున్నారనే కనీస వివరాలను పోలీసులు సేకరించలేదని ఆమె తప్పుపట్టారు. లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా... ఒకే చోట పార్కింగ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

నేరం జరిగిన తర్వాతే సీసీ కెమెరాలు పరిశీలించడం సరైందికాదు...

టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదన్నారు. నేరం జరిగిన తర్వాతే సీసీ కెమెరాలు పరిశీలించడం సరైన విధానం కాదని... మధ్య మధ్యలో వాటిని పరిశీలిస్తుండాలన్నారు. నిందితులను అరెస్టు చేసినప్పటికీ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందని శ్యామల స్పష్టం చేశారు. ప్రతీ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'

ఇవీ చూడండి: వైద్యురాలి కుటుంబానికి గవర్నర్​ తమిళిసై పరామర్శ

TG_HYD_65_30_NATIONAL_WOMEN_COMISSION_AB_3064645 REPORTER: Nageshwara Chary ( ) వైద్యురాలి తల్లి, సోదరి ఫిర్యాదు చేస్తే... తమ పరిధిలోకి రాదని పోలీసులు పేర్కొన్నార్న ఆరోపణలపై ప్రబుత్వం విచారణ జరపాలని జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు చట్టాల కోణంలో కాకుండా.. ముందుగా మానవీయ కోణంలో స్పందించాలన్నారు. యువతి డయల్ 100 కాల్ చేయలేదని తప్పుపట్టడం సరికాదని... అలా జరుగుతుందని ఎవరూ ఊహించరని.. టెన్షన్ లో ఆలోచన కూడా రాకపోవచ్చుననన్నారు. ఘటన జరిగిన పరిసరాలు పరిశీలించామని.. యువతి కుటుంబ సబ్యులు, పోలీసులతో మాట్లాడి వివరాలు సేకిరంచినట్లు ఆమె తెలిపారు. యువతి ఫోన్ ను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించ లేదన్నారు. ఘటన జరిగిన టోల్ గేట్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉందన్నారు. పోలీసులు పెట్రోలింగ్ కూడా చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని శ్యామల తెలిపారు. చాలా సేపటి నుంచి లారీ ఆపి... మద్యం తాగుతున్నప్పటికీ... వాహనం ఎందుకు ఆగి ఉంది.. అందులో ఎవరున్నారనే కనీస వివరాలను పోలీసులు సేకరించలేదని ఆమె తప్పుపట్టారు. లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా... ఒకే చోట పార్కింగ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదన్నారు. నేరం జరిగిన తర్వాతే సీసీ కెమెరాలు పరిశీలించడం సరైన విదానం కాదని... మధ్య మధ్యలో వాటిని పరిశీలిస్తుండాలన్నారు. నిందితులను అరెస్టు చేసినప్పటికీ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందని శ్యామల అన్నారు. ప్రతీ రాష్ట్రంలో మహిళ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బైట్: శ్యామల కుందర్, జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.