ETV Bharat / state

20 అని రాస్తే మాత్రం మీ పని అయినట్టే... బీ అలర్ట్..! - must write clear date on cheks in 2020 year news

కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్​ను ఎంజాయ్ చేశాం. కానీ ఈ 2020 మనందరికీ ఓ కొత్త సమస్య తీసుకొచ్చింది. అదేంటి కొత్త సంవత్సరంతో సమస్యా...? అని ఆశ్చర్యపోకండి. కాస్త జాగ్రత్త వహిస్తే సింపుల్​గా బయటపడవచ్చు. అదేంటో తెలుసుకుందామా..!

must-write-2020-on-checks-in-this-year
20 అని రాస్తే మాత్రం మీ పని అయినట్టే... బీ అలర్ట్..!
author img

By

Published : Jan 2, 2020, 7:12 AM IST

Updated : Jan 2, 2020, 11:45 AM IST

నూతన సంవత్సరం వచ్చేసింది. 2020లోకి అడుగుపెట్టాం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే సంవత్సరం మన జీవితాలను తలకిందులు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అదేంటంటే... చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై తేదీ రాసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంప మునిగే ప్రమాదం ఉంది.

ఇది పాటించకపోతే కొంప కొల్లేరే..!

ఉదాహరణకు మనం 2020 ఫిబ్రవరి 15వ తేదీ పేరుతో చెక్ ఇవ్వాలనుకుంటే... 15-02-20 అని రాసి ఇస్తాం. సరిగ్గా ఇక్కడే మనకు ఓ చిక్కు వచ్చి పడనుంది. మీరు సంవత్సరం దగ్గర కేవలం 20 అని రాసి వదిలేస్తే 20 సంఖ్య తరువాత ఏ నంబరైనా రాసే అవకాశం ఉంటుంది. అదే 20 తర్వాత 19 అని రాస్తే 2019 అవుతుంది. 17 అని రాస్తే 2017 అవుతుంది. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని టోకరా పెట్టే గ్రూపులెన్నో ఇప్పటికే కాచుకోని ఉంటాయి. ఇలా డాక్యుమెంట్లు, చెక్కులపైన సులభంగా తేదీలు మార్చిపడేస్తారు. అందుకే ముఖ్యమైన వాటిపై తేదీలు రాసే విషయంలో అలర్ట్​గా ఉండాల్సిందే.

సమస్యకు పరిష్కారం ఎలా..?

మరి ఈ సమస్య నుంచి ఎలా బయపడాలని అనుకుంటున్నారా..? చాలా సింపుల్. సంవత్సరాన్ని పూర్తిగా రాస్తే సరిపొతుంది. అంటే మీరు 2020 ఫిబ్రవరి 15 అని చెక్​ పై రాయాలనుకుంటే... 15-02-2020 అని పూర్తిగా రాయాలి. అప్పుడు తేదీని మార్చే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు. ఈ చిన్న లాజిక్ కాస్త మర్చిపోతే మాత్రం అంతే సంగతులు... బీ కేర్​ ఫుల్.

ఇదీ చదవండి : కాసేపట్లో 'మహా' మంత్రివర్గ విస్తరణ- అజిత్, ఆదిత్యకు చోటు

Intro:AP_ONG_11_29_SOCIAL_MEDIO_POST_AP10072
కంట్రిబ్యూటర్. సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................................
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ అందరిని ఆలోచింపజేస్తుంది. నూతన సంవత్సరం లో ఎక్కడైనా తేదీ , సంవత్సరం వ్రాసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు ఈ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు. 1/01/20 అని ఏవైనా విలువైన పత్రాలతో వ్రాస్తే నష్టపోయే ప్రమాదం ఉందని 1/01/2020 అని పూర్తిగా వ్రాయాలని సూచిస్తున్నారు. 1/01/20 అని వ్రాయడం వలన సంవత్సరాన్ని 2000 లాగాని మరొసంవత్సరంగా గాని మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారుBody:ఒంగోలుConclusion:9100075319
Last Updated : Jan 2, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.