ETV Bharat / state

'హస్తం నేతలంతా ఏకమై ముఖ్యమంత్రిని గద్దె దించుతాం'

కేసీఆర్‌ పాలనలో  రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని.. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరి పార్లమెంటు ప్రజల కోసం జూబ్లీహిల్స్‌లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు.

Revanthreddy_Camp_Office_Inauguratuin
జూబ్లిహిల్స్​లో ఎంపీ రేవంత్​ రెడ్డి క్యాంపు కార్యాలయ ప్రారంభం
author img

By

Published : Dec 9, 2019, 6:28 PM IST

హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం నెత్తురోడుతోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు అంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించుతామని రేవంత్​ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2009లో ఈ రోజునే తన పుట్టిన రోజున, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు ప్రకటించిందని.. ఆ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు ప్రజల కోసం జూబ్లీహిల్స్‌లో క్యాంపు కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. గాంధీ భవన్‌లో 35 ఏళ్లుగా అటెండర్​గా పని చేస్తున్న షబ్బీర్‌ చేతులు మీదుగా కార్యాలయం ప్రారంభించారు.

ప్రతి శనివారం అందరికీ అందుబాటులో ఉంటా..

ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని రేవంత్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర సాధన కోసం 1969, 2009లో పోరాటం చేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జేసీ దివాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్‌, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

జూబ్లిహిల్స్​లో ఎంపీ రేవంత్​ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం

ఇదీ చూడండి: చటాన్​పల్లి ఎన్​కౌంటర్​పై సిట్​ కార్యాచరణ ప్రారంభం

TG_HYD_42_09_REVANTHREDDY_CAMP_OFFICE_INAUGURATUIN_AB_3038066 Reporter: Tirupal Reddy () ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ద్వజమెత్తారు. హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం రక్తం చిందుతోందని ఆరోపించిన రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ తెలంగాణ పాలిట శాపంగా దాపురించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు మొదటిసారి కేంద్రం ప్రకటించిన రోజు సందర్భంగా ఇవాళ మల్కాజిగిరి పార్లమెంటు ప్రజల కోసం క్యాంపు కార్యాలయాన్ని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జేసీ దివాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్‌, మల్రెడ్డి రంగారెడ్డిలతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయాన్నిగాంధీభవన్‌లో 35 సంవత్సరాలుగా పని చేస్తున్న అటెండర్‌ షబ్బీర్‌ చేతులు మీదుగా రేవంత్‌ రెడ్డి ప్రారంభింప చేశారు. కాంగ్రెస్‌ నేతలు అంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించితీరుతామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి శపదం చేశారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేందుకు వీలుగా క్యాంపు కార్యాలయాన్ని రేవంత్‌ రెడ్డి ఏర్పాటు చేశారని మహిళ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలు అన్నారు. స్వాతంత్ర సమరయోదులు, తెలంగాణ రాష్ట్రం కోసం 1969, 2009లో పోరాటం చేసిన వారిని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా సన్మానించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని ఆ తరువాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయలేయలేదని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి శనివారం...ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యాలయంలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని రేవంత్‌ స్పష్టం చేశారు. బైట్లు: రేవంత్‌ రెడ్డి, ఎంపీ మల్కాజిగిరి బైట్లు: నేరెళ్ల శారద, మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బైట్లు: షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.