ETV Bharat / state

అడుగడుగునా కాటేసే రాక్షసులు.. బాధితులకు దక్కని న్యాయం - బాధితులకు దక్కని న్యాయం

అడుగడుగునా.... దారికాసి కాటేసే రాక్షసులు. నిర్మానుశ్య ప్రదేశాలు, ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వలపన్ని మరీ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకొని దర్జాగా బయటకొచ్చేస్తున్నారు. పోలీసు ఠాణా గడపతొక్కినా... బాధితులకు న్యాయం దక్కని దుస్థితి.

బాధితులకు దక్కని న్యాయం
అడుగడుగునా కాటేసే రాక్షసులు
author img

By

Published : Dec 4, 2019, 9:11 AM IST

అడుగడుగునా కాటేసే రాక్షసులు.. బాధితులకు దక్కని న్యాయం
హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఓ మురికివాడలో తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 22ఏళ్ల యువకుడు... 15ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌లోనే జరిగింది. వనస్థలిపురంలో ఓ బీమా ఏజెంట్‌ను... ఆమె స్నేహితుడే వంచించి... మరో ఆరుగురితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో ఈఏడాది నమోదైన అత్యాచార కేసులో మచ్చుకు కొన్ని ఇవి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో దిశ ఘటనకు ముందే ఇవన్నీ జరిగాయి.

ఒంటరి యువతులే లక్ష్యం..

పైశాచిక సంస్కృతిని వంటబట్టించుకున్న కీచకులు... రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్తున్న యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. విచారణలో జాప్యం వల్ల నిందితులు బెయిల్‌పై దర్జాగా బయట తిరుగుతున్నారు. బస్టాండులు, రైల్వేస్టేషన్ల వద్ద కాపుకాసి ఒంటరి యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చిరునామా చెబుతామంటూ నమ్మిస్తున్నారు. మరికొందరు ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా అవతారమెత్తి గమ్యస్థానాలకు చేరుస్తామంటూ... నిర్మానుష్య ప్రాంతాల్లో అత్యాచారానికి ఒడిగడుతున్నారు.

చెప్పుకోలేని వారు 60 శాతం

ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌, కొన్ని ఆసుపత్రుల వద్ద దుర్మార్గులు నిత్యం తచ్చాడుతున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని ఉప్పల్, సాగర్ రోడ్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఆల్వాల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఇళ్లకు వెళ్లే యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీరిలో 60శాతం మంది జరిగిన ఘోరాన్నిచెప్పుకోలేక కుమిలిపోయి గుట్టుగా ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఇక చిన్నారులు, యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలను పరిచయస్తులే కాటేస్తున్నారు.

స్పందించని పోలీసులు..

ఆరంభ శూరత్వం... అటకెక్కుతున్న దర్యాప్తు.. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో దిశ తరహా సామూహిక అత్యాచారాలు, చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలు జరిగినా పోలీసులు పూర్తిస్థాయిలో స్పందించడం లేదు. కేసులు నమోదు చేసి... చేతులు దులిపేసుకుంటున్నారు. మరికొందరు అధికారులు బాధితురాలిని వేధిస్తున్నారు. వెకిలి ప్రశ్నలు వేస్తూ పోలీస్ వ్యవస్థపైనే ఏహ్యభావం కలిగేలా చేస్తున్నారు. పోలీసుల అలసత్వం కారణంగా మూడేళ్ల క్రితం కేసులు ఇప్పటికీ విచారణకు రాలేదు. వనస్థలిపురం ఠాణా పరిధిలో ఏడు నెలల క్రితం నమోదైన సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు బెయిల్ రావడం ఇందుకు నిదర్శనం.

ఇవీ చూడండి: విద్యార్థినులకు 3నెలల పాటు మార్షల్‌ ఆర్ట్స్ శిక్షణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.