హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైల్ ఢీకొన్న ఘటనలో రైల్ క్యాబిన్‌లో లోకో పైలెట్‌కు చిక్కుకున్నాడు. మూడున్నర గంటలుగా పైలెట్ చంద్రశేఖర్ క్యాబిన్‌లోనే ఉండిపోయాడు. అతనని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైద్యులు సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైల్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడం వల్ల పైలెట్‌ను రక్షించడం కష్టమవుతోంది. గ్యాస్ కట్టర్లతో క్యాబిన్ తొలగించేందుకు రక్షణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.