హైదరాబాద్ బోయిన్ పల్లిలోని నాగిరెడ్డి కాలనీలో శ్రీకాంత్ దంపతులు కాపురం ఉంటున్నారు. సంసారం సజావుగా సాగుతున్న తరుణంలో వారి మధ్య మనస్పర్ధలతో వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తరచుగా ఘర్షణలు జరుగుతున్న క్రమంలో శ్రీకాంత్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన భర్త శ్రీకాంత్... ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : పరిగిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం