హైదరాబాద్లో మహిళా, శిశుసంక్షేమశాఖపై ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి, పర్యవేక్షించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ లేఖలు రాయాలని నిర్ణయించారు.
కఠిన చర్యలు తప్పవు
అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వవొద్దని స్పష్టం చేశారు. ఎవరైన అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న మంత్రి... నాణ్యత లోపించకుండా, వేడివేడిగా వడ్డించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు