గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ... పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 571 గ్రంథాలయాలు ఉన్నాయని వాటన్నింటిని ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా