ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా పక్షపాతి అని... కార్మికుల జీవితాలను మెరుగుపర్చేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన భవన కార్మికుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చేవని... తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.6 లక్షల 30 వేలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ. 346 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పంపిణీ చేశామన్నారు.
అనంతరం ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి అనుమతించడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన చిక్కులు'