ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాలు సాగుచేసుకునేందుకు వసతి సౌకర్యాలు కల్పించాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాల ఎస్సీ కార్పోరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ఆధునిక వ్యవసాయం చేసేలా బిందుసేద్యం, విత్తనాలు, ఎరువులు అందించేలా సమగ్ర ప్యాకేజీ రూపొందించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధి ఎక్కువగా ఉన్న పది జిల్లాల్లో కనీసం వంద ఎకరాల చొప్పున లబ్ధిదారులకు భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ పరిధి తక్కువగా ఉన్న 20 జిల్లాల్లో కనీసం 500 ఎకరాల చొప్పున భూములు గుర్తించాలని... అందులో కనీసం 250 ఎకరాలు లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికిచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.50 వేల నుంచి రెండున్నర లక్షలకు పెంచడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో బాధితులకు అదనపు సౌకర్యాలు చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ