ETV Bharat / state

రాష్ట్రానికి ఐజీఎస్టీ ద్వారా 2,638 కోట్లు రావాలి: హరీశ్​రావు - సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలో దృశ్యమాధ్యమ సమావేశం

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల కోట్ల రూపాయలకు పైగా ఐజీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్​కు సిఫారసు చేయాలని మంత్రుల బృందాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కోరారు. ఐజీఎస్టీ చెల్లింపులపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలో దృశ్యమాధ్యమంలో సమావేశమైంది.

minister harish rao said state needs Rs 2,638 crore through IGST
రాష్ట్రానికి ఐజీఎస్టీ ద్వారా 2,638 కోట్లు రావాలి: హరీశ్​రావు
author img

By

Published : Oct 1, 2020, 5:22 PM IST

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల కోట్ల రూపాయలకు పైగా ఐజీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్​కు సిఫారసు చేయాలని మంత్రుల బృందాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కోరారు. ఐజీఎస్టీ చెల్లింపులపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలో దృశ్యమాధ్యమంలో సమావేశమైంది.

సిఫారసు చేయాలి

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం నుంచి అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. దిల్లీ, ఛత్తీస్​గఢ్​, పంజాబ్, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్న హరీశ్​రావు.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25,058 కోట్ల మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్​కు సిఫారసు చేయాలని కోరారు.

విరుద్ధంగా జమ

తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2,638 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. గతంలో ఆ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్​లో నిబంధలకు విరుద్ధంగా జమచేశారని కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని సమావేశంలో ఆయన ప్రస్తావించారు. కాగ్ సైతం తప్పు పట్టిన నేపథ్యంలో ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని..ఈ నెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు.

చర్యలు తీసుకోవాలి

హరీశ్​రావు ప్రతిపాదనను అంగీకరించిన సుశీల్ కుమార్ మోదీ.. ఐజీఎస్టీ మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 208-19లోనూ 13,944 కోట్ల మేర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్​లో జమ చేయడాన్ని కాగ్ మరో మారు తప్పు పట్టిందన్న హరీశ్​రావు.. అందులో తెలంగాణకు మరో 210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఐజీఎస్టీలో వార్షిక రిటర్నుల ద్వారా రాష్ట్రానికి మరో వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం సమావేశంలో కోరారు.

ఇదీ చూడండి : దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం: ఉత్తమ్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.