వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరిగితేనే... రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమవుతుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి' - minister harish rao about farmers in nabard meeting
వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి నాబార్డ్ సహకరించాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందుబాటులో ఉంచాలని నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో పేర్కొన్నారు.
'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరిగితేనే... రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమవుతుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Tg Hyd_20_23_minister_on_nabard_loans_ab_3038200
Reporter : mallik.b
Note : feed from 3g
( ) రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇతోధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన ఘనత తెరాస సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ప్రశంసించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రాడిస్సన్ బ్లూ హోటల్ లో నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు - 2020 కు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రాబ్యాంక్ ఈడీ కుల్ భూషణ్, నాబార్డ్ సీజీఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ - 2020-21ను మంత్రి ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ, వ్యవసాయం, అనుబంధ రంగాలు, రోడ్లు, గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం 114578.19 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేయాలని నాబార్డ్ రుణ ప్రణాళికలో ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే... ఈ సారి 13 శాతం కెటాయింపులు పెంచడం విశేషం. కీలక వ్యవసాయం, రైతాంగం బలోపేతం కోసం ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కెటాయిస్తున్నామని మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఒక్క వ్యవసాయం కోసమే 20 శాతం నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం... రైతుబంధు, బీమా, రుణ మాఫీ పథకాల అమలు కోసం వెచ్చిస్తుందని చెప్పారు. Vis......byte.......
తన్నీరు హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి