కరోనా వైరస్‌పై వస్తున్న వార్తలు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదన్న ఆయన... రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తోందని తెలిపారు. రేపు కరోనా వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుందని.. వైద్యులకు వైరస్‌పై తగు సూచనలు చేస్తోందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.
ఇవీ చూడండి: అశ్లీల వీడియోలు చూపించే... ఆ సార్ మాకొద్దు..!