రాష్ట్రంలోని ఎంఈడీ, వ్యాయామ విద్య కళాశాలల్లో పలు వృత్తి విద్యా కోర్సుల బోధన రుసుములు ప్రభుత్వం ఖరారు చేసింది. పది ప్రైవేట్ కాలేజీల్లో కనిష్ఠంగా రూ. 25వేలు... గరిష్ఠంగా రూ.36 వేల రుసుము ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
12 ప్రైవేట్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపెడ్ ఫీజు రూ.20 వేల నుంచి 25వేల వరకు నిర్ణయించారు. డిప్లమో ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డీపెడ్ రుసుము రూ.30వేలు... యూజీ డీపెడ్ ఫీజు రూ.25వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
మూడేళ్ల పాటు అంటే... 2021- 22 సంవత్సరం వరకు కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సమర్పించిన ఆదాయ, వ్యయాల ఆధారంగా.. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సర్కారు రుసుములు ఖరారు చేసింది. యాజమాన్యాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి రుసుములు వసూలు చేయవద్దని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ ఫారం...!