కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఎంఐఎంకు వేయాలని అసదుద్దీన్‌పై ఓవైసీ మాట్లాడారని మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి సభలో ఈ వ్యాఖ్యలు చేశారని... ఓటర్లను ఇలా కోరడం నియమావళికి వ్యతిరేకమని ఎస్ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సభలో ఓవైసీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా అందులో జత చేశారు.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి దగ్గరగా పని చేస్తున్న ఎంఐఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'అధికారంలోకి వస్తే.. మున్సిపల్ టాక్స్ రద్దు'