గజిబిజి జీవితాలను పక్కనపెట్టి ప్రకృతితో గడిపే సౌకర్యాన్ని కల్పిస్తున్న జంగిల్ ఫారెస్ట్ క్యాంప్‌ని సందర్శించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నగరవాసులను కోరారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌కు అతిసమీపంలో మజీద్ గడ్డ వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ క్యాంప్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సుమారు 400లకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు నగర వాసులకు సరికొత్త ఆహ్లాదాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
హైదరాబాదీలకు మరో అద్భుతమైన పార్కు అందుబాటులోకి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో మరిన్ని పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా ఎడ్వెంచర్ గేమ్స్, ఫారెస్ట్ క్యాంప్ ఫైర్, కాటేజీల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మౌంటైన్ క్లైంబింగ్, ఎడ్వెంచర్ సర్క్యూట్లను మంత్రులు ఆసక్తిగా తిలకించారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్