ETV Bharat / state

ఎక్కడికక్కడే ఆగిన ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ-ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పట్టణ ప్రణాళిక, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేకపోవడం వల్ల ముందుకు వెళ్లడంలేదు. సకాలంలో కోసం చర్యలు తీసుకంటున్న దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LRS process that stops on the spot in telangana
ఎక్కడికక్కడే ఆగిన ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ
author img

By

Published : Dec 23, 2019, 11:31 AM IST

రాష్ట్రంలో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ-ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియకు అడుగడుగున ఆడ్డంకులు ఏర్పడుతున్నాయి. గడువు ముంచుకొస్తున్నా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాల్సిన అధికారులకు.. లాగిన్‌ ఐడీలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్​లోనే చేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి అదనపు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు అందించేందుకు కూడా ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కానీ పురపాలక శాఖ నిర్లక్ష్యం వైఖరితో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

లాగిన్‌ ఐడీలు ఇప్పటికీ ఇవ్వలేదు..
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించాలంటే లాగిన్‌ ఐడీ తప్పనిసరి. అది లేకుండా అడుగు ముందుకు పడదు. పట్టణ ప్రణాళిక అధికారులు, పురపాలక కమిషనర్లు, సహాయ సిటీ ప్లానర్లకు లాగిన్‌ ఐడీలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. అధికారులు దరఖాస్తులను పరిశీలించకపోతే తదుపరి ప్రక్రియకు అవకాశం ఉండదు. ఈ ప్రక్రియ మొదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఇంత వరకు లాగిన్‌ ఐడీలు ఇవ్వకపోవడం వల్ల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకే పరిమితమైంది.

ఇబ్బందికరంగా ఉంటుందని..
పురపాలక శాఖ ఆలస్యం వల్ల... దరఖాస్తులన్నీ చివర్లో ఒకేసారి పరిశీలించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని సిబ్బంది వాపోతున్నారు. వెంటనే ఐడీలు ఇస్తే దరఖాస్తుల పరిశీలనకు శ్రీకారం చుడతామని చెబుతున్నారు. దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన వెంటనే దరఖాస్తుదారుడికి వన్‌టైం పాస్‌వర్డ్‌ రావాలి. అవి లేకపోతే డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉండదు. ఓటీపీలు రావడంలో తరచూ సాంకేతిక అంతరాయం ఏర్పడుతోంది. గత నాలుగు రోజులుగా ఓటీపీ రాకపోవడం వల్ల దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయంలో డీటీపీసీ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయ లోపమే కారణమని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

శాఖల మధ్య సమన్వనయలోపం, అధికారుల నిర్లక్ష్యం కలిపి.. సామాన్యులను ఇబ్బందిపాలు చేస్తున్నాయి.

ఎక్కడికక్కడే ఆగిన ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ

ఇదీ చూడండి : 'దిశ' నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం ప్రారంభం

TG_HYD_08_23_LRS_REGULARISATION_PENDING_PKG_3038066 Reporter: ఎం.తిరుపాల్‌ రెడ్డి ()తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్దీకరణ-ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియకు అడుగడుగున ఆడ్డంకులు ఏర్పడుతున్నాయి. గడువు ముంచుకొస్తున్నా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాల్సిన అధికారులకు ఉన్నతాధికారులు లాగిన్‌ ఐడీలు ఇవ్వకుండా మీనమేషాలు లేక్కిస్తున్నారు. సకాలంలో క్రమబద్ధీకరణ కోసం చర్యలు తీసుకంటున్న దాఖలాలు కనిపించడం లేదు. Look వాయిస్ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ-ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పట్టణ ప్రణాళిక, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేకపోవడంతో… ముందుకు వెళ్లడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో...ప్రధానంగా కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాలలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ విధానంలో చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న వారంతా...అదనపు చెల్లింపులు చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు అందించేందుకు కూడా ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కాని పురపాలక శాఖ ఈ వ్యవహారంపై పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. వాయిస్ఓవర్‌2: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించాలంటే.. లాగిన్‌ ఐడీ తప్పనిసరి. అది లేకుండా అడుగు ముందుకు పడదు. పట్టణ ప్రణాళిక అధికారులు, పురపాలక కమిషనర్లు సహాయ సిటీ ప్లానర్లకు లాగిన్‌ ఐడీలు ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. అధికారులు దరఖాస్తులను పరిశీలించకపోతే తదుపరి ప్రక్రియకు అవకాశం ఉండదు. దరఖాస్తుల ప్రక్రియ మొదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నా...ఇంత వరకు లాగిన్‌ ఐడీలు ఇవ్వకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకే పరిమితమైంది. కనీసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమించే పరిస్థితి కూడా లేదు. దీనితో...సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చివర్లో అన్నింటికి ఒకేసారి పరిశీలించి చర్యలు తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఐడీలు ఇస్తే… దరఖాస్తుల పరిశీలనకు శ్రీకారం చుడతామని చెబుతున్నారు. వాయిస్ఓవర్‌3: దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన వెంటనే దరఖాస్తుదారుడికి వన్‌టైం పాస్‌వర్డ్‌ రావాలి. వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌లు రాకపోతే తదుపరి డబ్బులు చెల్లించడానికి అవకాశం ఉండదు. ఓటీపీలు రావడంలో తరచూ సాంకేతిక అంతరాయం ఏర్పడుతోంది. గత నాలుగు రోజులుగా ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించే పరిస్తితి లేకుండా పోయింది. ఈ విషయంలో డీటీపీసీ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయ లోపమే కారణమని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసిన వెంటనే ఓటీపీ రావాలంటే ఒక మెసేజ్‌కు ఐదు పైసలు లెక్కన సంభదిత సర్వీస్ ప్రొవైడర్ కి చెల్లించాల్సి ఉంటుంది. డీటీపీసీ ఐదువేల రూపాయలు చెల్లిస్తుంది. ఈ మొత్తం డబ్బులకు సంబంధించి మెసేజ్‌లు పంపిన తర్వాత మల్లీ ఐదువేల రూపాయలు హెచ్‌ఎండీఏకు డీటీసీపీ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించి ఎప్పటికప్పుడు డీటీసీపీ డబ్బులు చెల్లించకపోవడంతో మెసేజ్‌లు రావడం లేదేని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. [00:03, 23/12/2019] upsrinu:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.