ETV Bharat / state

"ప్రశాంత్ ప్రేమ విఫలమై డిప్రెషన్​లో ఉన్నాడు" - PRASHANTH FATHER BABURAO

ప్రశాంత్‌ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మా అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్​లోకి వెళ్లాడు. ఆ క్రమంలోనే రాజస్థాన్ వెళ్లి.. పాకిస్థాన్ బోర్డర్​లోకి వెళ్లి ఉంటాడు. మా కొడుకుని క్షేమంగా అప్పగించాలి.  - బాబూరావు, ప్రశాంత్ తండ్రి

మా అబ్బాయి చాలా మంచోడు : ప్రశాంత్ తండ్రి
author img

By

Published : Nov 19, 2019, 11:23 AM IST

Updated : Nov 19, 2019, 12:48 PM IST

మా అబ్బాయి చాలా మంచోడు : ప్రశాంత్ తండ్రి

అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు. అందులో తెలుగు వాడైన ప్రశాంత్​ది హైదరాబాద్. ప్రశాంత్​కు సంబంధించిన వివరాలను ఆయన తండ్రి బాబూరావు మీడియాకు వివరించారు. ప్రశాంత్‌ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు.

మా కొడుకుని క్షేమంగా అప్పగించండి...

దిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తామని బాబూరావు తెలిపారు. మా కొడుకుని క్షేమంగా అప్పగించాలని కోరతామని చెప్పారు. విశాఖకు చెందిన తాము ఆరేళ్ల నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భరత్‌నగర్‌లో ఉంటున్నామని తెలిపారు.

ప్రేమ విఫమైనప్పటి నుంచే...

ప్రశాంత్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడని తండ్రి చెప్పారు. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. బెంగళూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సహోద్యోగిని స్వప్నిక పాండేతో ప్రేమలో ఉన్నాడని వివరించారు. ప్రేమ విఫలమైన కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డిప్రెషన్​లోనే రాజస్థాన్ వెళ్లి ఉంటాడని, పొరపాటున పాక్‌లోకి అడుగుపెట్టి ఉంటాడని సందేహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు చాలా మంచోడని, క్షేమంగా తమకు అప్పగించాలని కోరుతున్నాడు.

ఇవీ చూడండి : కిడ్నాప్​ కేస్​ - నాన్న ఫోన్​ నెంబర్​ గుర్తుంది.. కాల్​ చేశా..!

Hyd_TG_09_19_RTC_SWF_DGS_DEEKSHA_VIRAMANA_AB_TS10017 Contributer : S NAGARAJU Note : Feed On Taja Wats APP PH..9346919348 ( ) ఆర్టీసీ కార్మికులు 45 రోజులుగా చేస్తున్న సమ్మెపై హై కోర్టు ఇచ్చిన సూచనల మేరకు 19న నిర్వహించతలపెట్టిన సడక్‌ బంద్‌ వాయిదా వేసిన్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌ రిసాల గడ్డ లోని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ యునియన్‌ కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జెఎసీ కో కన్వనర్‌ లింగమూర్తి మూడు రోజులుగా చేస్తున్న నిరవదిక నిరాహార దీక్షను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆచార్య కోదండ రామ్‌, మందకృష్ణ మాదిగ, సీపీఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్‌ తదితరులు విరమింప చేశారు. హై కోర్టు సానుకూల ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో లింగమూర్తిని దీక్షను విరమింప చేసిన్నట్టు నేతలు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని, పది హేను రోజుల్లో కార్మికుల కోర్టు జోక్యం చేసుకోవాలని హై కోర్టు నేటి తీర్పులో పేర్కొందని ఆచార్య కోదండ రామ్‌ తెలిపారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, ఆందోళన యదాతధంగా కార్మికులు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరీ విడాలని మరో సారి కోర్టు పేర్కోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగి, ఉద్యోగి మధ్య మంచి సంబంధాలు నేరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచనలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఐక్యంగా కార్మికులు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి విజయం సాధించాలని మందకృష్ణ మాదిగ సూచించారు.... బైట్‌..... ఆచార్య కోదండ రామ్‌, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, బైట్‌.... చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బైట్‌.... తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బైట్‌..... మంద కృష్ట్ర మాదిగ,
Last Updated : Nov 19, 2019, 12:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.