ETV Bharat / state

గుడ్‌విల్‌తో "మద్యం" దుకాణాలకు గాలం

లక్కీడ్రాలో దుకాణాలు దక్కని లిక్కర్‌ వ్యాపారులు గుడ్‌విల్‌ అకౌంటింగ్​తో మద్యం షాపులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌లో రూ. 20 లక్షల నుంచి రూ.80లక్షలు ఇచ్చి దుకాణాలను కొనుగోలు చేస్తున్నారు. పట్టణం, మండల కేంద్రాల్లో దరఖాస్తు రుసుం రెండు లక్షలు మొత్తానికి మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా కాసుల వసూలు జరుగుతున్నట్లు సమాచారం.

author img

By

Published : Oct 28, 2019, 7:38 PM IST

గుడ్‌విల్‌తో "మద్యం" దుకాణాలకు గాలం

లిక్కర్‌ వ్యాపారానికి అలవాటు పడి... పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన వ్యాపారులు... లక్కీడ్రాలో దుకాణాలు దక్కని వారు గుడ్‌విల్‌ అకౌంటింగ్​తో దక్కించుకునేందుకు తెరలేపారు. రాష్ట్రంలో 2017-19 రెండు ఎక్సైజ్‌ సంవత్సరాల్లో దాదాపు 41వేల కోట్లు విలువైన 9.89 కోట్లు బీరు కేసులు, 6.81 కోట్లు లిక్కర్‌ కేసుల అమ్మకాలు జరిగాయి. ఇందులో లిక్కర్‌పై 27శాతం, బీర్‌పై 25శాతం లెక్కన దుకాణదారులకు మార్జిన్‌ ఉంటుంది.

భారీ సంఖ్యలో పోటీ పడుతున్న వ్యాపారులు

పెద్ద ఎత్తున వ్యాపారంలో లాభాలు ఉండడం వల్ల మద్యం దుకాణాల నిర్వహణకు భారీ సంఖ్యలో వ్యాపారులు పోటీ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లక్కీడ్రా తీశారు. అదృష్టం ఉన్న వాళ్లకే దుకాణాలు దక్కాయి. గతంలో మద్యం వ్యాపారం చేసిన చాలా మందికి దుకాణాలు దక్కలేదు. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వారిలో ఎక్కువమందికి దుకాణాలు దక్కాయి.

హైదరాబాద్‌లో ఒక్కో దుకాణానికి రూ.80లక్షలు డిమాండ్​

దుకాణాలు దక్కని... లిక్కర్‌ వ్యాపారులు కొత్తవాళ్లకు గాలం వేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో అయితే ఒక్కో దుకాణానికి రూ.80లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో అయితే రూ.80లక్షల వరకు అధిక డబ్బులు ఇచ్చి లైసెన్స్ దారుడిని తృప్తిపరుస్తున్నారు. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో తక్కువలో తక్కువ లైసెన్స్‌ ఫీజుకు మూడు నుంచి నాలుగు రెట్లు మొత్తం ముట్టచెప్పి తీసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారుల హంగామా

లైసెన్స్​తో పాటు మరో వ్యక్తిని లైసెన్స్​లో చేర్చేందుకు అవకాశం ఉంది. ఫీజు మొత్తంలో రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించ్చినట్లయితే గుడ్‌విల్‌ ఇచ్చిన వ్యక్తి పేరును కూడా లైసెన్స్‌దారుగా అదనంగా చేరుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్‌ వ్యాపారులు గుడ్‌విల్‌ ఇచ్చి మద్యం దుకాణాలు దక్కించుకునే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.

గుడ్‌విల్‌తో "మద్యం" దుకాణాలకు గాలం

ఇదీ చదవండిః భాగ్యనగరంలో 62మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.