ETV Bharat / state

పీఎస్ ఎదుటే కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య - lady suicide at panjagitta in Hyderabad

పంజాగుట్ట పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి చెందింది. తమిళనాడుకు చెందిన లోకేశ్వరి నిన్న సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు  ప్రాణాలు విడిచింది..

lady suicide at panjagitta in Hyderabad
నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి
author img

By

Published : Jan 1, 2020, 3:17 PM IST

Updated : Jan 1, 2020, 6:43 PM IST

హైదరాబాద్​ పంజాగుట్టు పోలీస్​ స్టేషన్​ ముందు నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన లోకేశ్వరి అనే మహిళ మృతి చెందింది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆమె... మంటలకు తాళలేక పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్లింది. అరుపులు, కేకలు పెట్టడం వల్ల వెంటనే స్పందించిన పోలీసులు మంటలను అర్పి... అంబులెన్స్​లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 80శాతానికి పైగా కాలిన గాయాలు కావడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

21తులాలు బంగారం చోరీ

చెన్నైకి చెందిన ఈమెకు 2013లో తిరుపతిలో ప్రవీణ్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చింది. బీఎస్ మక్తలో గది అద్దెకు తీసుకుని ఉండేది. ప్రవీణ్​కు చెందిన నగల దుకాణంలో పని చేసేది. దుకాణంలో 21తులాలు చోరీకి గురికావటంతో.. లోకేశ్వరి ఎత్తుకెళ్లిందని నిర్ధరించుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... లోకేశ్వరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన లోకేశ్వరి... ప్రవీణ్​తో గొడవపడి చెన్నై వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రవీణ్​ తనతో సహజీవనం చేసినట్లు లోకేశ్వరి చనిపోయే ముందు ఆరోపించింది.

ఐదు రోజుల క్రితం నగరానికి

ప్రవీణ్ ఏడున్నర లక్షలు ఇస్తానని ఒప్పుకున్నట్లు లోకేశ్వరి పోలీసులకు తెలిపింది. డబ్బుల కోసం లోకేశ్వరి... ప్రవీణ్​కు ఫోన్ చేస్తే హైదరాబాద్ రమ్మన్నాడు. తనకు తెలిసిన వ్యక్తి అయిన కన్నన్ వెంట పెట్టుకొని ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చింది. ప్రవీణ్ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఫోన్ స్విచాఫ్ చేయడం వల్ల లోకేశ్వరి మనస్తాపానికి గురైంది. మంగళ వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవీణ్ కోసం పలుచోట్ల వెతికి పంజాగుట్ట చౌరస్తా వద్ద ఆగారు. అక్కడ పోలీస్ స్టేషన్​ను చూసి... ప్రవీణ్​పై ఫిర్యాదు చేయడానికి లోకేశ్వరి సిద్ధమైంది.

సీసాలో పెట్రోలు విక్రయం

ఈ మేరకు ఓ కాగితంలో ప్రవీణ్ వివరాలు రాసి పక్కనే ఉన్న కన్నన్​కు ఇచ్చింది. అతను టీస్టాల్​కు వెళ్లి వచ్చేలోపు.... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్​కు వెళ్లి సీసాలో పెట్రోల్ తెచ్చుకుంది. స్టేషన్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. లోకేశ్వరికి సీసాలో పెట్రోల్ విక్రయించిన బంక్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి, దిశ ఘటన జరిగిన తర్వాత బాటిళ్లలో పెట్రోల్ విక్రయించొద్దని పోలీస్, పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసినా కొన్ని పెట్రోల్ బంక్ నిర్వాహకులు పెడచెవిన పెడ్తుండటం గమనార్హం.

నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

Last Updated : Jan 1, 2020, 6:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.