ETV Bharat / state

అశ్వత్థామ రెడ్డి, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా ?? - ముఖ్యమంత్రి స్థాయిని దిగ‌జార్చేలా కేసీఆర్ మాట్లాడారు

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ తప్పుబట్టారు. ఆర్టీసీ ఆస్తులపై వెంటనే శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఆనాడు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింది : శ్రవణ్
author img

By

Published : Oct 25, 2019, 6:05 PM IST

ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ముఖ్యమంత్రి స్థాయిని దిగ‌జార్చేలా కేసీఆర్ మాట్లాడార‌ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులు, అప్పులు, ఆదాయంపై వెంటనే శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకోకపోగా.. వాళ్ల క‌డుపుపై త‌ంతా అన‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో టీఎంయూను ఏర్పాటు చేయించి అశ్వథామ రెడ్డిని, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించిన కేసీఆర్‌ ఇప్పుడు వారిని విమర్శించడం సరికాదన్నారు. సీఎంని తిట్టొచ్చా అంటున్న కేసీఆర్ నాడు సోనియా గాంధీని తిట్టిన రోజు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింద‌ని ఎద్దేవా చేశారు. యూనియ‌న్లు ఏర్పాటు చేసుకోవ‌డం కార్మికుల రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కు అని శ్రవణ్ అన్నారు. కేసీఆర్ పుట్టక ముందే యూనియ‌న్లు పుట్టాయ‌న్నారు.

ఆనాడు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింది : శ్రవణ్

ఇవీ చూడండి : నూతన మద్యం విధానం... పెరిగిన ఆదాయం

TG_HYD_39_25_DASOJU_ON_KCR_AV_3038066 Reporter: Tirupal Reddy NOTE: feed from gandhi bhavan OFC () ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ముఖ్యమంత్రి స్థాయిని దిగ‌జార్చేలా కేసీఆర్ మాట్లాడార‌ని ఆరోపించిన‌ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ ఆర్టీసీకి చెందిన ఆస్తులు, అప్పులు, ఆదాయంపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వసాధార‌ణ‌మ‌ని...ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. ఒక పాల‌కుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకోవాల్సి ఉండ‌గా...వాళ్లను క‌డుపుపై త‌ంతా అన‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో టిఎంయును ఏర్పాటు చేయించి...అశ్వథామ రెడ్డిని, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ స‌మ‌యంలో ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేపించిన కేసీఆర్‌... ఇప్పుడు వారిని తూలనాడటం సరికాద‌న్నారు. ముఖ్యమంత్రిని తిట్టొచ్చా...అంటున్న కేసీఆర్ ఆనాడు సోనియాగాందీని తిట్టిన రోజు విజ్ఞత ఎక్కడికి పోయింద‌ని ప్రశ్నించారు. ప్రశ్నలు అడిగిన జ‌ర్నలిస్టుల‌ను తిట్టడం మంచి ప‌ద్దతేనా అని నిల‌దీశారు. యూనియ‌న్లు ఏర్పాటు చేసుకోవ‌డం కార్మికుల రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కు అని...కేసీఆర్ పుట్టక ముందే యూనియ‌న్లు పుట్టాయ‌న్నారు. హుజూర్ నగర్‌లో గెలిచాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకోవడం స‌రికాద‌న్నారు. బైట్: దాసోజు శ్రవ‌ణ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.