కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. 2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కన్నా.. గత ఐదేళ్లలో రెట్టింపు నిధులను విడుదల చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
600కి పైగా స్థానాల్లో అభ్యర్థులే లేరు..
తనకు భాజపా అంటే భయమని లక్ష్మణ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 600కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలపలేకపోయినందుకు భయపడాలా లేక హుజూర్నగర్లో కారు గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థికి పోలైనన్ని ఓట్లు కూడా దక్కించుకోనందుకు ఆ పార్టీకి భయపడాలా అని ఎద్దేవా చేశారు.
ఎవరికీ భయపడను..
మోదీ, రాహుల్ సహా తాను ఎవరికీ భయపడనని... తన బాస్లు దిల్లీలో లేరని.. తెలంగాణ గల్లీలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మకర సంక్రాంతి ప్రతిపక్షాల భ్రాంతిని తొలగించాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం