హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన గురునానక్ 550 జయంతి ఉత్సవాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గురునానక్ సందేశాన్ని తెలిపే తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిక్కు సోదరులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గురునానక్ సందేశాన్ని తెలియజేసేందుకు 17 భాషల్లో రచనలు అనువదించారు. విశాల్ దివాస్ కార్యక్రమానికి మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, ఐపీఎస్ అధికారిణి తేజ్ దీప్ కౌర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి