ETV Bharat / state

పనికి చేరారు.. మత్తుమందు పెట్టి మొత్తం ఊడ్చేశారు.. - హైదరాబాద్​లోని కోకాపేటలో దొంగతనం

ఇంట్లో పనికని చేరారు. వారం రోజుల్లో ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు. విశ్వాసంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించుకుని అన్ని రహస్యాలు తెలుసుకున్నారు. ఇంక అన్నీ ఓకే అనుకుని పధకం ప్రకారం తినే ఆహారంలో ఇంటిల్లిపాదికీ మత్తుమందు పెట్టి విలువైన వస్తువులతో ఉడాయించారు. ఈ ఘటన హైదరాబాద్​ నార్సింగి పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

kokapeta-theft-in-hyderabad
పనికి చేరారు.. మచ్చిక చేసుకుని ముంచేశారు
author img

By

Published : Jan 8, 2020, 2:27 PM IST

హైదరాబాద్​ నగర శివారులోని నార్సింగి పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం చోటుచేసుంది. పనిచేసే వారి ఇంట్లో ఇంత ఉప్పు తింటున్నామని ఎంతో విశ్వాసంగా ఏళ్ల తరబడి పనిచేసే పనివాళ్లను చూశాం కానీ.. నమ్మినందుకు ప్రతిఫలంగా మత్తుమందు పెట్టి విలువైన వస్తువులను దొంగతనం చేసి ఉడాయించిన పనివారిని కోకాపేటలో ఆరిస్టోస్​ పౌలోమీ విల్లాలో జరిగిన చోరీని చూస్తే అర్థమవుతుంది.

నమ్మించి.. దొంగతనం చేశారు...
కోకాపేటలోని 44వ నెం విల్లాలో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన నేపాలీ జంటను ​పనిమనుషులుగా కుదుర్చుకున్నారు. పనిలో చేరిన వారం రోజుల్లోనే పవిత్ర అనే పని అమ్మాయి ఇంట్లో మనిషిలా కలివిడిగా అందరితో కలిసిపోయింది. యజమానుల వ్యక్తిత్వంతో పాటు ఇంట్లో ఏ వస్తువులను ఎక్కడ దాచారో అన్ని క్షుణ్ణంగా గమనించింది. ఇంక అన్నీ బాగానే ఉన్నాయనుకుని.. ఇంట్లో వ్యక్తులకు ఎటువంటి అనుమానం రాకుండా ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకుంది.

ఈ నెల 3వ తేదీ రాత్రి మత్తుమందు కలిపిన భోజనాన్ని యజమాని కుటుంబంలోని వారికి పెట్టింది. వారు మత్తులో జారుకుందే తడవుగా ఆ పనిమనుషుల జంట బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, విలువైన దుస్తులను 4 బ్యాగుల్లో సర్దుకుని అక్కడి నుంచి పారిపోయారు.

మరో కూతురు ఫోన్​తో వెలుగులోకి వచ్చిన దొంగతనం
తెల్లారి గచ్చిబౌలీలో ఉండే వ్యాపారి మరో కూతురు కుటుంబ సభ్యులకు ఫోన్​ చేయగా ఎవరూ స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆమె విల్లాకు వచ్చి చూసే సరికి ఎక్కడివారు అక్కడ స్పృహలేకుండా పడిపోయి ఉండడం గమనించి చుట్టు పక్కల వారి సహాయంతో ఆస్పత్రికి తరలించింది.

సీసీటీవీలో దొరికిపోయారు

విల్లా అసోసియేషన్​ వారికి, సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టింది నేపాలీ పనిమనుషుల జంటేనని నిర్ధారించారు. వీరి చిత్రాలను ఇతర రాష్ట్ర పోలీసులకు, చుట్టు పక్కల పోలీస్​ స్టేషన్​లకు చేరవేశారు.

విల్లా చుట్టుపక్కల పనిచేసే నేపాలీలు ముగ్గురుని అదుపులోకి తీసుకుని.. ఆ జంటకు వీరికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నట్టు నార్సింగి సీఐ రమణగౌడ్​ తెలిపారు.

పనికి చేరారు.. మచ్చిక చేసుకుని ముంచేశారు

ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

Intro:TG_HYD_20_08_KOKAPET VILLA CHORI_AB_TS10020Body:హైద్రాబాద్ నగర శివారు నర్సింగి పోలీసుస్టేషన్ పరిదిలో దరుణం చోటుచేసుకుంది.... నేపాల్ కు చెందిన ఓ జంట కోకాపేటలోని ఓ విల్లాలో పని మనుషులుగా చేరారు.... వారం రోజులు అయిందో లేదో ఇంటి యజమానులకు ఆహారంలో మత్తుమందు కలిపిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించింది. కోకాపేటలోని ఆరిస్టోస్‌ పౌలోమీ విల్లా 44లో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. డిసెంబర్‌ 27వ తేదీన ఇంట్లో పనిచేసేందుకు ఓ ఏజెన్సీ నుంచి నేపాలీ జంటను కుదుర్చుకున్నారు. పనిమనిషి పవిత్రగా పరిచయం చేసుకుని ఇంటిలోని వారితో కలివిడిగా ఉంటోంది. దీంతో ఆ ఇంటిలోని వారికి తమపై నమ్మకం పెరిగేలా చేసుకుంది.ఆ ఇంట్లో మనుషుల వ్యక్తిత్వంతోపాటు విలువైన వస్తువులు ఎక్కడెక్కడ దాచారో ఆమె వారం పాటు గమనించింది. ఇక అన్ని కుదరడంతో 3వ తేదీ రాత్రి మత్తుమందు కలిపిన భోజనాన్ని యజమాని కుటుంబానికి పెట్టారు. వారు మత్తులోకి జారుకున్న అనంతరం బంగారు ఆభరణాలతో పాటు నగదు, వెండి వస్తువులు, విలువైన దుస్తులను 4 బ్యాగుల్లో సర్దుకుని వారిద్దరు ఉడాయించారు. 4వ తేదీ మధ్యాహ్నం గచ్చిబౌలిలో ఉండే ఆ వ్యాపారి మరో కుమార్తె విల్లాలోని కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆమె మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో విల్లాకు వచ్చి తలుపులు తీసిలోనికి వెళ్లి చూడగా..
కుటుంబసభ్యులంతా ఎక్కడి వారు అక్కడే పడిఉండటంతోపాటు కళ్లు తెరవకపోవడంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో విల్లా అసోసియేషన్‌ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మత్తులో ఉన్న ముగ్గురిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం, బీరువా లాకర్‌ తెరిచి ఉండటంతో ఇదంతా పనిమనుషుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నేపాలీ జంట ఫొటోలను ఇతర రాష్ట్ర పోలీసులకు చేరవేశారు. దీనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పనిచేసే నేపలిలను ముగ్గురుని అదుపులోకి తీసుకుని.... ఆ జంటకు వీరికి ఏమైనా సంబంధం ఉందా ..? అనే కోణంలో విచారిస్తున్నరూ.Conclusion:బైట్... రామణగౌడ్.సి ఐ నర్సింగి పోలీసుస్టేషన్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.