హైదరాబాద్ బండ్లగూడలో జరుగుతున్న శిశుమందిర్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. దేశంలో సిద్ధాంతపరమైన సంఘర్షణ జరుగుతోందని అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడి జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారూ భారతదేశంలో ఉన్నారని తెలిపారు.
అక్రమంగా చొరబడినవారిని ఏరివేసేందుకే కేంద్రం చర్యలు చేపడితే... కొందరు కావాలని అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సిద్ధాంతపరమైన సంఘర్షణ జరుగుతున్న సమయంలోనే బండ్లగూడలో శిశుమందిర్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి