హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరులో కన్న తల్లిని హత్య చేసి ఘటనలో నిందితురాలు కీర్తిరెడ్డిని.. పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. గత నెల 19న ఆమె తల్లి రజితను హత్య చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు దృశ్యం సినిమాను తలపించింది.
కీర్తి రెడ్డిని బెదిరించి లొంగదీసుకున్న పక్కింటి కుర్రాడు శశికుమార్.. ఆమె తల్లిని చంపేందుకు ప్రేరేపించాడు. పథకం ప్రకారం... కీర్తి తల్లి కళ్లల్లో కారం చల్లింది. వెంటనే కిందపడిపోవడంతో తల్లి పైన కూర్చొని చేతులు పట్టుకుంది. ఇంటి బయటే ఉన్న శశికుమార్ లోపలికి వచ్చి చున్నీతో రజిత గొంతుకు బిగించి.. ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
తల్లి కనిపించట్లేదని తరువాత ఆమె హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.
ఇవీ చూడండి: కీర్తి క్రిమినల్ ఎందుకయింది?
ఇవీ చూడండి: తల్లిని హత్య చేసిన కేసులో దర్యాప్తు వేగవంతం