హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మారేడుపల్లిలోని తన నివాసం వద్ద 63 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేద ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం తన వంతు సహాయంగా లక్ష రూపాయలను అందించి వారి వివాహంలో తోడ్పడుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ఆడపడుచులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ చేసిన అద్భుత పథకం కల్యాణలక్ష్మి షాదీముబారక్ అని ఆయన వెల్లడించారు. దళారులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సన్న బియ్యాన్ని అందించి పోషకాహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: త్వరలో పౌల్ట్రీ పాలసీ: మంత్రి తలసాని