వారెంటు, ఎలాంటి నోటిసులు లేకుండా కాసింను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది రఘునందన్ అన్నారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఉస్మానియా వైస్ ఛాన్స్లర్ అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారన్నారు. ఒక ప్రోఫెసర్‌ను ఇలా అరెస్టు చేయడం సరియైన చర్య కాదన్నారు.
కాసింను అక్రమంగా పోలీసులు నిర్భందించారంటూ పౌరహక్కుల సంఘం హైకోర్టులో ఎబియస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన జస్టిస్ న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్ అత్యవసర విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం తన ఎదుట హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాసింను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. కాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో గజ్వేల్ డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నేను తెలంగాణ వాడినే అనే పుస్తకంతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలపై రాసిన పుస్తకాలపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి : జాతీయ రహదారిపై ప్రమాదం... వాహన రాకపోకలకు అంతరాయం