విలాసవతమైన జీవనం:
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దొంగతనం చేసిన సొమ్ము వేలాది రూపాయలతో విలాసవంతమైన ఇళ్లలో అద్దెకుంటూ, లక్షలు వెచ్చించి తన పిల్లలను స్కూల్లో చేర్పించాడు. చివరికి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద దొంగతనానికి పాల్పడే క్రమంలో పోలీసులకు చిక్కాడు. రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.
అయితే అతను అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ అని.. ఉత్తరప్రదేశ్‌కి చెందినవాడిగా గుర్తించినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 2004 నుంచి నేరచరిత్ర ఉందన్నారు. ఇప్పటివరకు అతడు 400కు పైగా దొంగతనాలు చేశాడని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నట్లు అనురాధ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ