ETV Bharat / state

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - హైదరాబాద్ ఉప్పుగూడ ప్రాంతంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కళాశాలకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చిందని యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం వల్లో లేదా తనకు ఉద్యోగం రావడం లేదనో పాతబస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Nov 14, 2019, 4:59 PM IST

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఉప్పుగూడ ప్రాంతంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 17 ఏళ్ల జయలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. జయలక్ష్మి బాలాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె కళాశాలకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చిందని యాజమాన్యం తల్లిదండ్రులను పిలిచి ఫిర్యాదు చేశారు. ఈ విషయానికో లేదా తనకు ఉద్యోగం రాలేదనో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. జయలక్ష్మి చనిపోయే ముందు తనకు ఉద్యోగం రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటు రాసిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు జయలక్ష్మి ఎందుకు చనిపోయిందో... దర్యాప్తు చేస్తే తప్ప చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

Tg_hyd_27_14_inter_student_suicide_av_ts10003 feed from what's up desk. కళాశాలకు మొబైల్ తీసుకోనివచ్చిందని యాజమాన్యం, తల్లీతండ్రులకు పిర్యాదు చేయడం వల్లనో లేదా, తనకు ఉద్యోగం రావడం లేదనో ఓ ఇంటర్ విద్యార్తిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక ps పరిధిలోని ఉప్పుగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది, 17 yrs ల జయలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని బాలాపూర్ చౌరస్తాలోని ఓ ప్రవేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాo చదువుతుంది.కాలేజి యాజమాన్యం మృతురాలి తల్లిదండ్రులకు పిలిచి మృతురాలి పై ఫిర్యాదు చేశారని లేదంటే తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై నిన్నటి రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య చెసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది, ఆత్మహత్యకు గల కారణాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతురాలికి ఉద్యోగం రావడం లేదని అందుకొరకు సూసైడ్ చేసుకుంటున్నట్లు నోట్ లో రాసి ఉన్నది అని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఏమి చెప్పడం లేదు. ఛత్రినాక పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.