ETV Bharat / state

పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే 'ఇన్నోవేషన్​ యాత్ర' - పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే 'ఇన్నోవేషన్​ యాత్ర'

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికి తీసి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలో ఆవిష్కరణల యాత్ర జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా ఈ యాత్ర నిర్వహించనున్నాయి. ఎంపిక చేసిన 120 మంది విద్యార్థులతో నాలుగు మార్గాల్లో నాలుగు బస్సుల్లో యాత్ర నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Innovation_Yatra in telangana
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే 'ఇన్నోవేషన్​ యాత్ర'
author img

By

Published : Jan 3, 2020, 4:54 AM IST

Updated : Jan 3, 2020, 7:35 AM IST

పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే 'ఇన్నోవేషన్​ యాత్ర'

గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్... ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యక్రమానికి ప్రణాళిక చేశాయి. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కణల యాత్ర నిర్వహించాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా 4మార్గాల్లో 4బస్సుల్లో సుమారు 4వేల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించి... ఉత్తమ ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపిక చేసిన 120 మంది విద్యార్థులు యాత్రలో పాల్గొననున్నారు.

వినూత్న ఆలోచనలను వీడియో తీసి పంపాలి..

ఈ యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను 90 సెకన్ల నుంచి 180 సెకన్ల వరకు వీడియో తీసి... 80740 18372 నంబరుకు వాట్సాప్‌ చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ ద్వారా అందిన ఆవిష్కరణలను పరిశీలించి... ఒక్కో విశ్వవిద్యాలయం పరిధి నుంచి 10 మంది చొప్పున 120మందిని ఎంపిక చేస్తారు. ఆవిష్కరణల యాత్రలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను భాగస్వామ్యం చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేటర్​ కేంద్రాలు

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్ నాటికి ఇంక్యుబేటర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ తెలిపారు. జేఎన్​టీయూహెచ్​లో ఇప్పటికే జే హబ్ ప్రారంభమైందని... ఓయూలోనూ పనులు మొదలయ్యాయని చెప్పారు. ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సుమారు 14 శాతం మంది విద్యార్థులు... లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నా స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్నారని జయేశ్​ రంజన్ తెలిపారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని టీఎస్​ఐసీ, ఉన్నత విద్యా మండలి కోరాయి. వివిధ కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులతో కార్యక్రమం నిర్వహించారు.

ఇవీ చూడండి: సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు

TG_HYD_87_02_INNOVATION_YATRA_PKG_3064645 REPORTER: Nageshwara Chary ( ) గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికి తీసి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలో ఆవిష్కరణల యాత్ర జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా ఈ యాత్ర నిర్వహించనున్నాయి. ఎంపిక చేసిన 120 మంది విద్యార్థులతో నాలుగు మార్గాల్లో నాలుగు బస్సుల్లో యాత్ర నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. యాత్రలో పాల్గొనే ఆసక్తి ఉన్న విద్యార్థులు సుమారు రెండు నిమిషాల వీడియోను వాట్సప్ ద్వారా పంపించాలని అధికారులు కోరుతున్నారు. look.. వాయిస్ ఓవర్: గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్... రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యక్రమానికి ప్రణాళిక చేశాయి. ఫిబ్రవరి 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కణల యాత్ర నిర్వహించాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మార్గాల్లో నాలుగు బస్సుల్లో సుమారు నాలుగు వేల కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో ముగింపు కార్యక్రమం నిర్వహించి... ఉత్తమ ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపిక చేసిన 120 మంది విద్యార్థులు యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను 90 సెకన్ల నుంచి 180 సెకన్ల వరకు వీడియో తీసి... 80740 18372 నెంబరుకు వాట్సప్ పంపించాలని అధికారులు సూచించారు. వాట్సప్ ద్వారా అందిన ఆవిష్కరణలను పరిశీలించి... ఒక్కో యూనివర్సిటీ పరిధి నుంచి 10 మంది చొప్పున 120మందిని ఎంపిక చేస్తారు. ఆవిష్కరణల యాత్రలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను భాగస్వామ్యం చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. బైట్: ఎ.విజయ, టీఎస్ఐసీ ప్రోగ్రాం డైరెక్టర్ బైట్: టి.పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వాయిస్ ఓవర్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏప్రిల్ నాటికి ఇంక్యుబేటర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య లింబాద్రి తెలిపారు. జేఎన్ టీయూహెచ్ లో ఇప్పటికే జే హబ్ ప్రారంభమైందని..ఓయూలోనూ పనులు మొదలయ్యాయని చెప్పారు. ఐఐటీ, ఐఐఐటీల్లో సుమారు 14 శాతం మంది విద్యార్థులు లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్టార్టప్ లు ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్నారని జయేష్ రంజన్ తెలిపారు. బైట్: జయేష్ రంజన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి బైట్: ఆచార్య లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వాయిస్ ఓవర్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కళాశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని టీఎస్ఐసీ, ఉన్నత విద్యా మండలి కోరాయి. వివిధ కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. end
Last Updated : Jan 3, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.