ETV Bharat / state

గేమింగ్​కు అడ్డా భాగ్యనగరం@ ఇండియా జాయ్​ - గేమింగ్​కు అడ్డా భాగ్యనగరం

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న... ఇండియాజాయ్-2019 రెండోరోజూ ఉత్సాహంగా సాగింది. సినిమా, గ్రాఫిక్స్, గేమింగ్ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సంస్థల విభిన్న సాంకేతిక ఉత్పత్తులు అబ్బురపరుస్తున్నాయి.

INDIA JOY PROGRAM today news
author img

By

Published : Nov 22, 2019, 10:37 AM IST

గేమింగ్​కు అడ్డా భాగ్యనగరం@ ఇండియా జాయ్​

టెక్నాలజీ, గేమింగ్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరానికి అందిస్తూ హెచ్​ఐసీసీలో బుధవారం ప్రారంభమైన ఇండియా జాయ్ రెండో రోజు విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే బ్రాడ్​కాస్ట్​లో వస్తున్న మార్పులు... యువతను డిజిటల్ మీడియా ఆకట్టుకుంటున్న తీరుపై పలువురు ప్రముఖులతో నిర్వహించిన ప్యానెల్ డిస్కర్షన్లు అలరించాయి.

వెబ్​సీరీస్​ల డిజైనింగ్​పై చర్చ...

ఈ సదస్సులో సన్ లైఫ్, పిల్లల ఛానెల్స్​కి సంబంధించిన ప్రముఖులు పాల్గొని... చిన్నారులను ఆకట్టుకునే రీతిలో సరికొత్త వెబ్​సీరీస్​ల డిజైనింగ్​పై చర్చించారు. ఏవీజీసీఐ సెక్టార్ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. యానిమేషన్ రంగంలో రాణిస్తూ... అద్భుతమైన మార్కెట్ షేర్​ని సాధించే విషయమై చేపట్టిన పవర్ ప్లేయర్స్ సెషన్​లో యువత ఉత్సాహంగా పాల్గొంది. రెండో రోజు ఇండియా జాయ్​లో ఫేస్​బుక్ కనెక్ట్, వీఆర్​ గేమింగ్​కి సంబంధించి ఏర్పాటు చేసిన వర్క్​షాప్​లు అలరించాయి. పలువురు యువత గేమింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు.

ఇండియా జాయ్​లో విదేశీయులకు చోటు...

యువత లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఇండియా జాయ్​లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన యువత భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఇండియా జాయ్​లో పాల్గొనే వారికోసం ప్రత్యేకంగా గ్లోబల్ యూత్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా దాదాపు 42 దేశాలకు చెందిన యువతీ యువకుల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి... అర్హులైన యాభై మందికి పైగా ఈ ఇండియా జాయ్​లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. రష్యా, కొరియా సహా దాదాపు 42దేశాలకు చెందిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొని వీఎఫ్​ఎక్స్, గేమింగ్ రంగాల్లో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు.

యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఇండియా జాయ్ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు నగరవాసులను అలరించనుంది.

ఇవీ చూడండి:ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.