ETV Bharat / state

మార్గాన్ని సూచిస్తున్నందుకే 'దిశ'గా నామకరణం

దేశం నలుమూలల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనల రూపం 'దిశ '. హైదరాబాద్​ శివారులో నవంబర్​ 27న దారుణంగా హత్యాచారానికి గురైంది యువ వైద్యురాలు. అత్యాచార బాధితుల అసలు పేరు ఏ ఒక్కరూ ఉచ్చరించొద్దన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో 'దిశ'గా నామకరణం చేశారు. అయితే ఈ పేరే ఎందుకు.. దాని అర్థం ఏంటీ..?

మార్గాన్ని సూచిస్తున్నందుకే 'దిశ'గా నామకరణం
మార్గాన్ని సూచిస్తున్నందుకే 'దిశ'గా నామకరణం
author img

By

Published : Dec 7, 2019, 7:43 AM IST

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కల్చివేసింది దిశ హత్యాచార ఘటన. హైదరాబాద్​ శివారులో నలుగురు దుర్మార్గుల చేతిలో పదిరోజుల క్రితం దారుణంగా హతమైన యువ వైద్యురాలు దిశ. ఆమె హత్యాచారానికి గురయ్యిందన్న సమాచారాన్ని నిర్ధరించుకున్న పోలీసులు.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించారు. ఆమె పేరును పత్రికలు, ప్రసార మాధ్యమాలతోపాటు తమ శాఖలోని అధికారులు, సిబ్బంది కూడా ఉచ్చరించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

నిర్భయ మాదిరి..

సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ వీసీ సజ్జనార్​ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దిశ ఘటన జరిగిన అనంతరం వివరాలు తెలిపేందుకు శంషాబాద్​లో గత నెల 29న జరిగిన విలేకరుల సమావేశంలో యువవైద్యురాలి అసలు పేరు ప్రచురించవద్దని.. ఫొటోలు, వీడియోలు చూపించవద్దని అభ్యర్థించారు. ఆమెకు ఏదైనా పేరు పెట్టాలని అప్పుడు అనుకున్నారు. దిల్లీలో ఏడేళ్ల క్రితం అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు 'నిర్భయ'గా వ్యవహరించాలంటూ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యువ వైద్యురాలి పేరును కూడా 'నిర్భయ' మాదిరిగానే వ్యవహరించాలని పలు పేర్లను పరిశీలించారు.

41 పేర్లు పరిశీలన..

పేరు పెట్టినప్పుడు అలాంటి పేరున్న యువతి, బాలిక, మహిళ ఉండకూడదని అనుకున్నారు. మొత్తం 41 పేర్లను పరిశీలించారు. తెలుగు ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధుల నుంచి పేర్లను తీసుకున్నారు. ఒక్కొక్క పేరు.. దాని అర్థం తెలుసుకున్నాక 'దిశ' అని ఖరారు చేశారు. హత్యోందంతానికి సాక్ష్యంగా ఎలాంటి ఆధారాలు లేని స్థితిలో దర్యాప్తునకు మార్గ దర్శనం చేసేలా ఉండాలని నిర్ణయించారు. మార్గాన్ని సూచిస్తున్నందుకే 'దిశ' అని నామకరణం చేశారు. అనంతరం మృతి చెందిన యువ వైద్యురాలి పేరును 'జస్టిస్​ ఫర్​ దిశ'గా మీడియాలో ప్రచురించాలని పోలీసు అధికారులు ప్రకటించారు.

ఇవీ చూడండి: దశ 'దిశ'ల హర్షం.. మృగాలపై కానరాని సానుభూతి

TG_HYD_15_07_NAME_DISHA_DRY_3182400 ( )దిశ .. పేరు ఇలా నిర్ణయించారు...ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి గుండెను తడుతున్న పేరు ...దేశం నలుమూలల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనల రూపం ' దిశ . . . . హైదరాబాద్ శివారులో నలుగురు దుర్మార్గుల చేతిలో పదిరోజుల క్రితం దారుణంగా హతమైన యువ వైద్యురాలు. ఆమె హత్యాచారానికి గురయ్యిందన్న సమాచారాన్ని నిర్ధారించుకున్న పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించారు. ఆమె పేరును పత్రికలు, ప్రసార మాధ్యమాలతో పాటు తమ శాఖలోని అధికారులు, సిబ్బంది కూడా ఉచ్చరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన జరిగిన అనంతరం వివరాలు తెలిపేందుకు శంషాబాద్ లో గత నెల 29న జరిగిన విలేకరుల సమావేశంలో యువవైద్యురాలి అసలు పేరు ప్రచురించవద్దని, ఫోటోలు, వీడియోలు చూపించవద్దని అభ్యర్థించారు. ఆమెకు ఏదైనా పేరు పెట్టాలని అప్పుడు అనుకున్నారు . దిల్లీలో ఏడేళ్ల క్రితం చోటుచేసుకున్న అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు ' నిర్భయ ' గా వ్యవహరించాలంటూ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యువ వైద్యురాలి పేరును కూడా ' నిర్భయ ' మాదిరిగానే వ్యవహరించాలని పలు పేర్లను పరిశీలించారు. పేరు పెట్టినప్పుడు అలాంటి పేరున్న యువతి , బాలిక , మహిళ ఇలా ఎవరి పేరు ఉండకూడదని అనుకున్నారు. మొత్తం 41 పేర్లు పరిశీలనకు తీసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధుల నుంచి కూడా పేర్లను తీసుకున్నారు. ఒక్కొక్క పేరు..దాని అర్ధం తెలుసుకున్నాక ' దిశ ' అన్న పేరును ఖరారు చేశారు. హత్యోదంతానికి సాక్ష్యంగా ఎలాంటి ఆధారాలు లేని స్థితిలో దర్యాప్తునకు మార్గ దర్శనం చేసేలా ఉండాలని అనుకున్నారు . మార్గాన్ని సూచిస్తున్నందుకే దిశ అని నామకరణం చేశారు. అనంతరం మృతి చెందిన యువ వైద్యురాలి పేరును..జస్టిస్ ఫర్ దిశ గా మీడియా లో ప్రచురించాలని పోలీసు అధికారులు ప్రకటించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.