ETV Bharat / state

"దిశ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించారా?" - హైకోర్టు: సుప్రీం మార్గదర్శకాలు పాటించారా?

దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను ఈనెల 13 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్​కౌంటర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ పాటిస్తే ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేసింది. గురువారం తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది.

Highcourt on disha's
"దిశ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించారా?"
author img

By

Published : Dec 9, 2019, 9:35 PM IST

హైకోర్టు: సుప్రీం మార్గదర్శకాలు పాటించారా?

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల మృతదేహాలను ఈనెల 13 వరకు భద్రపరచాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించాలని పేర్కొంది. ఎన్​కౌంటర్​పై పలు మహిళ, ప్రజా సంఘాల ప్రతినిధులు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది.

సుప్రీం మార్గదర్శకాలు పాటించారా?

ఎన్​కౌంటర్​ల విషయంలో సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించారా? పోలీసులపై కేసు నమోదు చేశారా? అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​ను హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టామని... ఘటనపై కేసు నమోదు కాగా.. పోలీసులపై చేయలేదని ఏజీ పేర్కొన్నారు.

భద్రపరచండి..

ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా వేసినందున... హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా వేయాలని హైకోర్టును ఏజీ కోరారు. అంగీకరించిన ధర్మాసనం.. మృతదేహాలు చెడిపోకుండా ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించి.. శుక్రవారం వరకు భద్రపరచాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్​ రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది.

బాధిత కుటుంబాలకు పరిహారం

ఎన్​కౌంటర్​పై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలని.. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని కోరుతూ న్యాయవాది రాఘవేంద్ర ప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దిశ కుటుంబానికి కూడా పరిహారం చెల్లించేలా ఆదేశించాలని విన్నవించారు. రెండింటిని కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి: ఎన్​హెచ్​ఆర్సీ ఎదుట దిశ తండ్రి, సోదరి... అరగంటపాటు విచారణ

TG_HYD_48_09_HC_ON_ENCOUNTER_PKG_3064645 REPORTER: Nageshwara Chary ( ) దిశ హత్య కేసు నిందితుల మృతదేహలను ఈనెల 13 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కౌంటర్ల విషయంలో సుప్రీంకోర్టు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించారా అని ప్రశ్నించిన ధర్మాసనం.. ఒకవేళ పాటిస్తే ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్ కౌంటర్ కేసు బుధవారం సుప్రీంకోర్టులో ఉన్నందున... తాము గురువారం తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. look వాయిస్ ఓవర్: ఎన్ కౌంటర్ లో లో చనిపోయిన నలుగురి మృతదేహాలను ఈనెల 13 వరకు భద్రపరచాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించాలని పేర్కొంది. ఎన్ కౌంటర్ పై పలు మహిళ, ప్రజా సంఘాల ప్రతినిధులు రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్ కౌంటర్ ల విషయంలో సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించారా... పోలీసులపై కేసు నమోదు చేశారా అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టామని... ఘటనపై కేసు నమోదయిందని.. పోలీసులపై చేయాలని లేదని ఏజీ పేర్కొన్నారు. ఇదే అంశంపై విచారణ సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసినందున... గురువారానికి వాయిదా వేయాలని హైకోర్టును ఏజీ కోరారు. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం.. మృతదేహాలు చెడిపోకుండా ఏసీ వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించి.. శుక్రవారం వరకు భద్రపరచాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలని.. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని కోరుతూ న్యాయవాది రాఘవేంద్రప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దిశ కుటుంబానికి కూడా పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. రెండింటిని కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.