ఉద్యోగాల నెపంతో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలను కువైట్, అరబ్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పలువురు ఏజెంట్లు మహిళలకు మాయమాటలు చెప్పి... ఉద్యోగాల పేరుతో విదేశాల్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్‌కు చెందిన అనేక మంది మహిళలు అరబ్ దేశాల్లో మగ్గుతున్నారని వెల్లడించారు.
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏజెంట్లపై చర్యలు తీసుకొని... అరబ్ దేశాల్లో ఇబ్బందులకు గురవుతున్న మహిళలను ఇండియాకు రప్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు.
ఇదీ చూడిండి: బ్రిడ్జ్ మ్యాన్: పింఛన్ డబ్బుతో నదిపై వంతెన