ETV Bharat / state

నుమాయిష్​కు హైకోర్టు పచ్చజెండా - నుమాయిష్​ ఎగ్జిబిషన్​కు హైకోర్టు అనుమతి

రేపటి నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్​కు ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. గత జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు... సీపీ అంజనీకుమార్​ సమర్పించిన నివేదికను పరిశీలించి వాటిన్నింటినీ కచ్చితంగా అమలుచేయాలని స్పష్టం చేసింది.

High Court  given the permition for Numaish Exhibition
నుమాయిష్​కు హైకోర్టు పచ్చజెండా
author img

By

Published : Dec 31, 2019, 7:01 PM IST

ప్రతిష్టాత్మక నుమాయిష్​కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతేడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన న్యాయస్థానం తనిఖీ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఇవాళ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్వయంగా ధర్మాసనం ఎదుట హాజరై... భద్రత ఏర్పాట్లు, ఎన్​వోసీలు, తనిఖీల నివేదికలను సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు... రేపటి నుంచి ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అనుమతించింది.

నివేదికల్లో పేర్కొన్న విధంగా భద్రత ఏర్పాట్లను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికల్లో పేర్కొన్నట్లు భద్రత ఏర్పాట్లు ఉన్నాయో.. లేవో తనిఖీ చేసి జనవరి 6న నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: సీపీ ​

TG_HYD_70_31_HC_ON_EXHIBITION_AV_3064645 REPORTER: Nageshwara Chary note: హైకోర్టు, నుమాయిష్ విజువల్స్ వాడుకోగలరు. ( ) రేపు ప్రారంభం కానున్న నుమాయిష్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. గత జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు... ఇవాళ తనిఖీ నివేదికలు సమర్పించాలని నిన్న ఆదేశించింది. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజినీ కుమార్ స్వయంగా ధర్మాసనం ఎదుట హాజరై భద్రత ఏర్పాట్లు, ఎన్ ఓసీలు, తనిఖీల నివేదికలను సమర్పించారు. నివేదికలను పరిశీలించిన హైకోర్టు... రేపటి నుంచి ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అంగీకరించింది. అయితే నివేదికల్లో పేర్కొన్న విధంగా భద్రత ఏర్పాట్లను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. నివేదికల్లో పేర్కొన్నట్లు భద్రత ఏర్పాట్లు ఉన్నాయో లేదో తనిఖీలు జరిపి జనవరి 6న నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.