హైదరాబాద్‌లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చువల్ రన్ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం నిర్వహించిన ఈ రన్‌ను ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎన్‌ఎండీసీ అందించిన క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించారు.
దేశంలో ఏటా 15 శాతం మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని ఈటల తెలిపారు. క్యాన్సర్‌కు ఆహారపు అలవాట్లు మారడం కూడా ఒక కారణమన్నారు. దేశంలో ఇప్పటికే క్యాన్సర్‌పై అవగాహన పెరిగిందని.. దాన్ని ముందుగా గుర్తించడమే ముఖ్యమని చెప్పారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కాలంలోనూ మధుమేహం, రక్తపోటు ఔషధాల కొరత