ETV Bharat / state

డబ్బులు లెక్క కాదు... ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: ఈటల - తెలంగాణ తాజా వార్తలు

అవయవ మార్పిడి, క్యాన్సర్‌ చికిత్స వంటి ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. వైద్యఆరోగ్యశాఖ అనేక సంస్కరణలు తీసుకురాబోతోందని మంత్రి వెల్లడించారు. కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ కంటే వందరెట్లు మెరుగైన సేవలను ఆరోగ్యశ్రీ అందిస్తోందని స్పష్టం చేశారు.

eetala rajendar press meet
డబ్బులు లెక్క కాదు... ప్రజల ఆరోగ్యమే ముఖ్యం : ఈటల
author img

By

Published : Oct 8, 2020, 3:45 PM IST

Updated : Oct 8, 2020, 4:45 PM IST

ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా సంస్కరణలు తీసుకురాబోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక అంశాలను చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం....ఆరోగ్యశ్రీ తదితర అంశాలపై పలు మార్పులు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. వైద్యం ఖరీదును తగ్గించడమే గాక.... అవయవ మార్పిడి, క్యాన్సర్‌ చికిత్సల వంటి ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని మంత్రి ఈటల అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. కేరళ, ఇతర రాష్ట్రాలను పోటీపడుతు వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

డబ్బులు లెక్క కాదు... ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: ఈటల

త్వరలోనే ఖాళీలు భర్తీ..

ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన మందులు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్య సిబ్బంది పరంగా ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే 12,000 ఉద్యోగాలు మంజూరైనప్పటికీ కరోనా వల్ల పెండింగ్​లో ఉండిపోయాయని... భవిష్యత్​లోనే వాటిని భర్తీ చేస్తామని ఈటల తెలిపారు.

మండలానికో 108 వాహనం

అర్బన్‌ ఏరియాలో బస్తీ దవాఖానాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని ఈటల తెలిపారు. సుమారు 60 రకాల వైద్య పరీక్షలు బస్తీ దవాఖానాలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. 108 వాహనాలు పూర్తిస్థాయి తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో నిర్వహణ జరుగుతోందన్న ఈటల... అన్ని మండలాల్లో 108 వాహనాలు ఉండేటట్లుగా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిందని తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక

Last Updated : Oct 8, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.