ETV Bharat / state

"మహిళల్లో పోటీతత్వం పెరగాలి.. అన్నిరంగాల్లో రాణించాలి" - ముషీరాబాద్​లో మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో టీ-గవర్నర్

జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్​లో మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. మహిళలు ప్రతి రంగాన్ని సవాల్​గా తీసుకుని ముందుకెళ్లాలని తమిళిసై అన్నారు.

ముషీరాబాద్​లో మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో తమిళిసై
author img

By

Published : Oct 31, 2019, 4:11 PM IST

ముషీరాబాద్​లో మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో తమిళిసై

మహిళలు ప్రతిరంగాన్ని సవాల్​గా తీసుకుని ముందుకు వెళ్లాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్​లో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ముగింపు వేడుకలకు తమిళిసై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై మరో మూడు నెలల్లో పూర్తిగా భాష మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు లక్ష్మణ్​తో కలిసి ధ్రువపత్రాలను అందజేశారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తానని లక్ష్మణ్ అన్నారు.

ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

TG_Hyd_33_31_Governar_On_Women_Skill_Development_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) మహిళలు ప్రతి రంగాన్ని సవాల్‌ గా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉద్భోదించారు. ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని నైపుణ్యత సాధించాలని గవర్నర్ సూచించారు. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం కూడా మహిళలకు ఎంతో అవసరమని తమిళిసై పేర్కొన్నారు. ముషీరాబాద్‌ కాషిష్ కన్వెన్షన్ సెంటర్‌లో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ముందుగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న గవర్నర్‌....మరో మూడు నెలల్లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రతి మహిళా ఆరోగ్యంపై శ్రద్ద చూపాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌తో కలిసి ధృవపత్రాలు ప్రదానం చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చునని భాజపా నేత లక్ష్మణ్ తెలిపారు. అలాగే మిగతా మహిళలు కూడా శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బైట్: తమిళిసై సౌందర రాజన్, గవర్నర్ బైట్: కె లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.