ప్రపంచంలో పాల ఎగుమతుల్లో భారత్ అగ్రగామిగా ఉందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమం సాగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌లో 110వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభమైంది. ఈ మేరకు వ్యవసాయ పరిశోధన సేవలకు సంబంధించి మూడు మాసాల శిక్షణా కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా 25రాష్ట్రాల నుంచి 135 యువ శాస్త్రవేత్తలు శిక్షణకు హాజరయ్యారు. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ సేవలు క్షేత్రస్థాయికి విస్తరింపచేయాలని గవర్నర్ తెలిపారు. పరిశోధన ఆధారంగా పరిశ్రమల స్థాపన జరుగాలన్నారు.
దేశంలో ప్రతి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని... రెండో హరిత విప్లవం దిశగా యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలని తమిళిసై సూచించారు. వ్యవసాయ రంగంలో అపారమైన అవకాశాలున్నాయన్నారు. వృత్తి జీవితంలో మానసిక ఒత్తిళ్లు అధిగమించేందుకు యోగ శిక్షణ అలవరుచుకోవాలని గవర్నర్ తెలిపారు.
ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి