ETV Bharat / state

'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా' - governer tamilisai and bandaru dattatreya meet at Gandhi 150th Birth day Celebrations

షాద్​నగర్​లో పశువైద్యురాలి దారుణహత్యపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను గౌరవించే సంస్కృతి భారతీయులదని... ఈ విషయంలో జరిగిన దారుణం అత్యంత బాధాకరమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు.

governer tamilisai and bandaru dattatreya meet at Gandhi 150th Birth day Celebrations
'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'
author img

By

Published : Dec 1, 2019, 2:18 PM IST

పశువైద్యురాలి దారుణహత్య తనను తీవ్రంగా కలిచివేసిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని.. మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళి సై పాల్గొన్నారు. కార్యక్రమంలో బండారు దత్తాత్రేయకు... గవర్నర్‌ స్వర్ణ కంకణ ధారణ చేశారు. హత్యాచారం వంటి అమానుష ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ గానే కాదు ఓ మహిళగా, తల్లిగా ఆ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అమానవీయ ఘటన గురించి విని నిద్రలేని రాత్రి గడిపానని తెలిపారు. ఆడపిల్లలు ధైర్యంగా, ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ తరహా అమానుష ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

ఇవీచూడండి: ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.. జీరో ఎఫ్​ఐఆర్​ ఉందిగా..!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.