ETV Bharat / state

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం, నగదు - పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

పార్కింగ్​ చేసిన కారులో 4 కిలోల బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని ఈస్ట్​ మారేడ్​పల్లిలో జరిగింది.

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..
author img

By

Published : Nov 23, 2019, 8:48 PM IST

Updated : Nov 23, 2019, 10:13 PM IST

సికింద్రాబాద్​ ఈస్ట్​ మారేడ్​పల్లిలోని ఓ నర్సింగ్​ హోం వద్ద పార్కు చేసిన కారులో 40 బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కోల్​కతా నుంచి మైసూర్​ మీదుగా హైదరాబాద్​కు​ బంగారాన్ని తరలించినట్లు ఒప్పుకున్నారు. పట్టుబడిన నిందితులు మగ్గురు కూడా హైదరాబాద్​కు చెందినవారే.

బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి డీఆర్ఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారానికి, నగదుకు ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అరెస్ట్ చేసిన ముగ్గురిని విచారిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. బంగారం విలువ కోటి 95 లక్షల రూపాయల వరకు ఉంటుందని.. ఈ పుత్తడి ఎవరికి సంబంధించినదనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

ఇదీ చూడండి: ఊహించని మలుపు- మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

Intro:సికింద్రాబాద్ ఈస్ట్ మారెడ్ పల్లిలో ఓ ఇంట్లో స్మగ్లింగ్...
పార్కింగ్ లో ఉన్న కార్ లో 4 కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో గుర్తించారు..కార్లలో అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ఈస్ట్ మారేడ్పల్లి చెన్నై నర్సింగ్ హోమ్ వద్ద ఓ కారు లో గ్రీన్ కలర్ బ్యాగ్ లో వీరు బంగారు బిస్కెట్లను తరలిస్తున్న గుర్తించారు..మైసూరు నుండి హైదరాబాదుకు వస్తున్న వ్యక్తులు ఇద్దరూ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు..అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తున్న వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు..ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు..కస్టమ్స్ చట్టప్రకారం బంగారు బిస్కెట్లను డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ... వీటి విలువ2 కోట్లు వరకు ఉంటుందని ఎవరికి సంబందించినదనే అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు..ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని డబ్బును ఇంట్లో ఉండటం పై పోలీసులు వారి నుండి వివరాలు సేకరిస్తున్నారు.. Body:VamshiConclusion:7032401099
Last Updated : Nov 23, 2019, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.