శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1.66 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, మస్కట్ సహా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా అక్రమంగా బంగారం తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డారు.
ఐదు కేసుల్లో 841 గ్రాములు,700 గ్రాములు, 928గ్రాములు, 797 గ్రాములు, 817గ్రాముల చొప్పున మొత్తం 4.08 కిలోల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు.