నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుట్టుపల్లిలో దర్గా చెట్టును ఆ ఊరివారు దేవుడి చెట్టుగా భావిస్తారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ చెట్టుకు పూజలు చేసి జెండా ఉంచుతారు. ఇది ఆ ఊరి ఆనవాయితీ. అయితే.. తాము ఎంతో భక్తిగా కొలిచే ఈ చెట్టు ఉన్నట్లుండి ఎండిపోయిందనీ.. ఇలా జరగడం అశుభానికి ప్రతీక అని గ్రామస్థులు అంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు చిగురించాలి కానీ.. ఇలా అకస్మాత్తుగా ఎండిపోవడమేంటో తమకు అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఏం జరుగుతుందో అని భయపడుతున్నామని తెలిపారు.
- ఇదీ చూడండి : తను కన్నవారికీ... తనను కన్నవారికీ... తనే అమ్మ!