ETV Bharat / state

'ఎర్ర' దొంగలు దొరికారు... హైదరాబాద్​లో ఎర్రచందనం ముఠా అరెస్ట్

ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టయింది.  అమీర్​పేట్​ వద్ద సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న ముఠా అరెస్టు
author img

By

Published : Nov 7, 2019, 10:36 PM IST

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న ముఠా అరెస్టు

ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తోన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.5 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా నుంచి ఎర్రచందనాన్ని నగరానికి తీసుకుచ్చి... రంగారెడ్డి జిల్లాలోని పెద్ద షాపూర్​ వద్ద నిల్వ చేసేందుకు తరలిస్తుండగా అమీర్​పేట్ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు. ఎర్రచందనం విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.6 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​ తెలిపారు. నిందితుల వద్ద ఎర్రచందనంతో పాటు ఓ కారు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు ఎన్​. రాధాకృష్ణ, కె. చంద్ర, చెన్నయ్య, రామ్​ సేవక్​ కుమార్​లుగా సీపీ వెల్లడించారు.

ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.