ETV Bharat / state

అద్దె ఇంటి కోసం వెతుకుతూ మృత్యు ఒడిలోకి - హైదరాబాద్​ గచ్చిబౌలి పైవంతెన ప్రమాదం

హైదరాబాద్​ గచ్చిబౌలి బయోడైవర్సిటీ  పైవంతెనపై జరిగిన ప్రమాదం... ఓ కుటుంబంలో విషాదం నింపింది. అద్దెఇంటి కోసం వెతుకుతూ వెళ్లిన మహిళ... రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయింది.

అద్దె ఇంటి కోసం వెతుకుతూ మృత్యు ఒడిలోకి
author img

By

Published : Nov 24, 2019, 7:45 AM IST

అద్దె ఇంటి కోసం వెతుకుతూ మృత్యు ఒడిలోకి

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన సోమశేఖర్‌, సత్యవేణి దంపతులు.. కుమార్తెలు ప్రణీత, వాణిలతో సహా ఏడాది క్రితం హైదరాబాద్‌ చేరారు. ప్రస్తుతం మణికొండలో నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారు. ఇందులో భాగంగా కుమార్తె ప్రణీతతో కలిసి శనివారం కూకట్‌పల్లి బయల్దేరారు. బస్టాపులో వేచి ఉండగా... గచ్చిబౌలి బయెడైవర్సిటీ పైవంతెన పైనుంచి కారు క్షణాల్లో దూసుకొచ్చి సత్యవేణిని ఢీకొట్టింది. త్రుటిలో తప్పించుకున్న ప్రణీత... తేరుకుని చూసేలోపే తల్లి అక్కడికక్కడే మరణించింది. క్షణాల్లో తల్లి విగతజీవిగా మారడాన్ని చూసి ప్రణీత గుండెలవిసేలా రోదించింది.

మృతురాలి కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తామని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఫ్లైఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.