జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా హుక్కా సెంటర్ల నిర్వాహకుల నుంచి, అక్కడికి వచ్చిన యువత నుంచి పోలీసులు లంచం తీసుకున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ దృష్టికి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేయగా నిజమని తేలడంతో అంజనీ కుమార్ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఎస్సైలు కురుమూర్తి, శ్రీను... ప్రస్తుతం పని చేస్తున్న ఎస్సైలు శంకర్, రామకృష్ణలతో పాటు ఏఎస్సైలు మహమ్మద్ జాఫర్, శామ్యూల్‌లను సస్పెండ్ చేశారు. పోలీస్‌శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సీపీ వెల్లడించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ